Wednesday, 03 June 2026
SWASTHIK NEWS
Home / సినిమా

కేరళలో రష్మిక ‘మైసా’ యాక్షన్ హంగామా!

26 Apr 2026
02:33 PM
33

స్వస్తిక్ న్యూస్, సినిమా :- నేషనల్ క్రష్’ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘మైసా’ షూటింగ్ ప్రస్తుతం కేరళలో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన అప్‌డేట్‌లను చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది.హై-వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ​కేరళలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో సుమారు 15 రోజుల పాటు భారీ యాక్షన్ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. ఇంటర్నేషనల్ స్టంట్ మాస్టర్ ఆండి లాంగ్ పర్యవేక్షణలో, ప్రముఖ కొరియోగ్రాఫర్ కేచా ఖంఫక్డీ నేతృత్వంలో ఈ పోరాట దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్లు సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

ముఖ్య విశేషాలు:- ఈ సినిమాలో రష్మిక ఒక గోండు గిరిజన యువతిగా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు జేక్స్ బెజోయ్ ఈ సినిమాకు బాణీలు అందిస్తున్నారు.​ప్రస్తుతం విడుదలైన రష్మిక రౌద్ర రూపం చూస్తుంటే, ఆమె ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నట్లు అర్థమవుతోంది. గిరిజన పోరాట యోధురాలిగా ఆమె నటన ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా

Swasthik News

Share this Article

Chenna

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates