Wednesday, 22 July 2026
SWASTHIK NEWS
Home / క్రీడలు

RCB vs RR మ్యాచ్: వర్షం కారణంగా ఆలస్యమైన టాస్

10 Apr 2026
07:20 PM
28

స్వస్తిక్ న్యూస్, స్పోర్ట్స్:-

RCB vs RR మ్యాచ్:- వర్షం కారణంగా ఆలస్యమైన టాస్

గువహటి:-  ఐపీఎల్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య అసోంలోని గువహటి వేదికగా జరగాల్సిన మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. స్టేడియం పరిసరాల్లో భారీ వర్షం కురుస్తుండటంతో టాస్ వేయడం ఆలస్యమైంది.

​ముఖ్య విశేషాలు:మైదాన పరిస్థితి: ప్రస్తుతం వర్షం కురుస్తుండటంతో గ్రౌండ్ మొత్తం కవర్లతో కప్పి ఉంచారు.

​అంపైర్ల నిర్ణయం: వర్షం తగ్గుముఖం పట్టాక, అంపైర్లు పిచ్‌ను క్షుణ్ణంగా పరిశీలించి టాస్ సమయాన్ని ప్రకటించనున్నారు.

గత అనుభవం:- ఇదే నెల 7వ తేదీన గువహటిలో జరిగిన రాజస్థాన్-ముంబై మ్యాచ్ కూడా భారీ వర్షానికి గురైంది. ఆ రోజు మ్యాచ్‌ను కేవలం 11 ఓవర్లకు కుదించి నిర్వహించాల్సి వచ్చింది. అసోంలో వరుసగా మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగిస్తుండటంతో, ఐపీఎల్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా "అస్సాంలో మ్యాచ్ అంటేనే అస్సామే (ఖతం)" అంటూ ఫన్నీగా సెటైర్లు వేస్తున్నారు.మ్యాచ్‌కు సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ కోసం వేచి ఉండండి!

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates