మార్కాపురం జిల్లా:- మార్కాపురం పట్టణంలో SVKP కాలేజీ గ్రౌండ్ లో మొదటి సారిగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మార్కాపురం జిల్లా అయిన తరువాత మొట్టమొదటిసారిగా నిర్వహించినటువంటి ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా జిల్లా యంత్రాంగా అధికారులు, కూటమి నాయకులు, ప్రజలు మరియు విద్యార్థులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ప్రకాశం జిల్లా పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ప్రకాశం జిల్లా టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు & కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తమల అశోక్ రెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కలిసి ఈ వేడుకలలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన శఖటాలు ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించి, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, కళాకారులకు శిల్డ్‌లు బహుకరించి ప్రోత్సహించారు.
