స్వస్తిక్ న్యూస్, త్రిపురాంతకం:- ఎస్సీ కమిషన్ మెంబర్ గౌతమ్ రాజ్ పర్యటనలో భాగంగా మార్కాపురం జిల్లా, త్రిపురాంతకములో అంబేద్కర్ వాసులు ఆయనను కలిసి అంబేద్కర్ భవన్ ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు. వెంటనే ఆయన స్పందించి అధిష్టానం దృష్టికి తీసుకొని వెళ్తానని.. అంబేద్కర్ భవన్ కు కృషి చేస్తానని ఎమ్మార్వో కృష్ణమోహన్ కి స్థలం కేటాయించాలని సూచించారు.