స్వస్తిక్ న్యూస్, స్పోర్ట్స్ :- ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఎట్టకేలకు బోణీ కొట్టింది. రాజస్థాన్ రాయల్స్ (RR)తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో కేకేఆర్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఒకానొక దశలో ఓటమి ఖాయమనుకున్న స్థితి నుండి రింకూ సింగ్ తన వీరోచిత పోరాటంతో జట్టును గెలిపించాడు.
మ్యాచ్ విశేషాలు:- లక్ష్యం రాజస్థాన్ రాయల్స్ నిర్ణయించిన 156 పరుగుల లక్ష్యంతో కేకేఆర్ బరిలోకి దిగింది.సంక్షోభంలో కేకేఆర్ఛే దనలో కేకేఆర్ వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కేవలం 70 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోవడంతో విజయంపై ఆశలు సన్నగిల్లాయి.రింకూ - అనుకూల్ జోడిఈ క్లిష్ట సమయంలో రింకూ సింగ్ (53), అనుకూల్ రాయ్ (29) కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ అజేయంగా నిలిచి 76 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.ముగింపు రింకూ సింగ్ బౌండరీల వర్షం కురిపించడంతో కేకేఆర్ విజయం సులభతరమైంది. ఈ సీజన్‌లో కేకేఆర్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం.గెలుపు అసాధ్యం అనుకున్న చోట రింకూ సింగ్ మరోసారి తన ఫినిషింగ్ సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు.