Monday, 16 March 2026
Swasthik News
Home / జాతీయ వార్తలు

మహా శివరాత్రి ఎఫెక్ట్ : బెంగళూరులో మాంసం అమ్మకాలు నిషేధం

13 Feb 2026
12:04 PM
114

స్వస్తిక్ న్యూస్, బెంగుళూరు :-  హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. ఈ మహాశివరాత్రి రోజున హిందువులు ఎంతో భక్తితో పూజలు చేస్తూ తమ భక్తిని చాటుకుంటారు. ఈ నేపథ్యంలో హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండా ఉండేందుకు "గ్రేటర్ బెంగళూరు అథారిటీీ"(GBA)  కీలక ఆదేశాలు జారీ చేసింది. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 15వ తేదీన ఆదివారం బెంగళూరులో జంతువు వధ మరియు మాంసం అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు.

Article Image

గ్రేట్ బెంగళూరు అథారిటీ పరిధిలోని అన్ని చికెన్, మటన్ మరియు చేపల దుకాణాలను అలాగే కబేలాలు ఫిబ్రవరి 15 తేదీన 24 గంటల పాటు మూసివేయాలి అని కీలక ఆదేశాలను జారీ చేసింది. హిందూ దేవుళ్లను, సాంస్కృతిక ఆచారాలు అలాగే మతపరమైన సెంటిమెంట్ల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాము అని తెలిపింది.

Article Image

దీంతో ఫిబ్రవరి 15 శివరాత్రి రోజున 24 గంటలపాటు మాంసం అమ్మకాలు జరగవు. ఈ విషయాన్ని బెంగుళూరు పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి అని... ముఖ్యంగా చికెన్ షాప్ మరియు ఫిష్ షాప్ యాజమాన్యాలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు. గ్రేటర్ బెంగళూరు అథారిటీ వారు జారీ చేసిన ఆదేశాలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!