మేడారం మహాజాతర:- ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరైనటువంటి మేడారం సమ్మక్క సారక్క అమ్మవారిల జాతర నేటితో నిన్నటితో ముగిసింది. ఈనెల 28వ తేదీన మొదలైన ఈ మేడారం మహా జాతర నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా కొనసాగింది. ఇప్పటివరకు లక్షల్లో భక్తులు మేడారం మహా జాతర లో పాల్గొని సమ్మక్క సారక్కకు ముడుపులు అలాగే మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం మహా జాతర చివరి అంకానికి చేరుకోవడంతో సమ్మక్క సారలమ్మ అమ్మవారి వనప్రవేశం మొదలయ్యింది.

గద్దెల వద్ద పూజలు అనంతరం చిలకలు గుట్టకు సమ్మక్క, కన్నేపల్లికి సార్లమ్మ, పూనుగుండ్లకు పగిడిద్దరాజు అలాగే కొండాయికి గోవిందరాజు చేరారు. అమ్మవారుల వన ప్రవేశం సమయంలోను వేలాదిమంది భక్తులు పాల్గొనడం జరిగింది. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మేడారం మహా జాతర ఈ ఏడాది చాలా ఘనంగా అలాగే ఉత్సాహంగా జరిగింది. మంత్రి సీతక్కతో పాటుగా ఎంతోమంది రాజకీయ నేతలు అలాగే సినిమా సెలబ్రిటీలు వారందరితోపాటు పెద్ద ఎత్తున దేశ నలుమూలల నుంచి ఎంతోమంది భక్తులు వచ్చి దర్శించుకున్నారు. దీంతో అంగరంగ వైభవంగా ఈసారి సమ్మక్క సారక్క జాతర ముగిసింది.