స్వస్తిక్ న్యూస్, స్పోర్ట్స్:-
చెన్నై:- చెపాక్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ (DC) తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. నిర్ణీత ఓవర్లలో చెన్నై జట్టు 212/2 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.
హైలైట్స్:- శాంసన్ వీరవిహారం: సిఎస్‌కే బ్యాటర్ శాంసన్ అజేయ సెంచరీతో జట్టుకు భారీ స్కోరును అందించారు. కేవలం 56 బంతుల్లోనే 115 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు.
ఆయుష్ రాణక:- మరోవైపు ఆయుష్ 59 పరుగులతో రాణించి, తన వంతు సహకారాన్ని అందించిన అనంతరం రిటైర్డ్ అవుట్ (స్వచ్ఛందంగా పెవిలియన్‌కు వెళ్లడం)గా వెనుతిరిగారు.
ఇతర స్కోర్లు:- కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 15 పరుగులు చేయగా, శివమ్ దూబే 20* పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
బౌలింగ్:- ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టారు.ప్రస్తుతం 213 పరుగుల భారీ లక్ష్యంతో ఢిల్లీ క్యాపిటల్స్ బరిలోకి దిగనుంది. శాంసన్ మెరుపు ఇన్నింగ్స్‌తో చెపాక్ స్టేడియం హోరెత్తిపోయింది.