పుల్లలచెరువు పోలీసుల చర్యలు భేష్.
(స్వస్తిక్ న్యూస్, పుల్లలచెరువు:-)
పుల్లలచెరువు ఎస్సై సాంబశివరావును మార్కాపురం కోర్టు అడ్వకేట్ నేనావత్. అశోక్ నాయక్ ఆదివారం పుల్లలచెరువులో కలిశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శాంతి, భద్రతల పరిరక్షణ కోసం ఎస్సై చేపడుతున్న చర్యలను ప్రశంసించారు. బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలని కోరినట్లు తెలిపారు. మార్కాపురం జిల్లా పరిధిలో ఎస్సీ, ఎస్టీలకు వారికి అవసరమైన న్యాయ సహాయాన్ని ఉచితంగా అందిస్తానన్నారు.