Monday, 16 March 2026
Swasthik News
Home / ఆంధ్రప్రదేశ్

శబాష్ లోకేష్.. చిన్నారి కోసం 6 కోట్ల భరోసా

27 Feb 2026
08:45 AM
366

స్వస్తిక్ న్యూస్,ఆంధ్రప్రదేశ్ :-  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలుకు చెందినటువంటి పునర్విక అనే ఒక 10 నెలల చిన్నారి SMA TYPE -1 అనే వ్యాధితో బాధపడుతుంది. ఆ చిన్నారి కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత చందా రూపంలో సహాయం చేస్తుండడం ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తుంది. ఆ చిన్నారి వ్యాధి నయం కావడానికి అక్షరాల 16 కోట్ల రూపాయలు కలిగినటువంటి ఒక ఇంజక్షన్ అవసరమయ్యింది. ఈ ఇంజక్షన్ 16 కోట్లు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తూ వస్తుండడంతో ఈ విషయం అందరికీ తెలిసింది.

Article Image

గత 20 రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత సహాయం చేస్తుండడంతో అవి అంతా ఇంతా చేరి ఏకంగా 10 కోట్ల రూపాయల వరకు పోగయ్యింది. మానవత్వం తెలుగు రాష్ట్రాల్లో ఇంకా బతికే ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనం అనే చెప్పవచ్చు. ఇక తాజాగా మంత్రి నారా లోకేష్ సైతం మిగతా 6 కోట్లకు నా వంతు సమకూర్చడం నా బాధ్యత అంటూ ముందుకు వచ్చారు. దీంతో అత్యవసర సమయంలో ఆపద్బాంధవుడిలా ముందుకు వచ్చి ఆదుకుంటాను అని భరోసా ఇచ్చినటువంటి లోకేష్ కు ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇప్పటివరకు నారా లోకేష్ చాలా మందికి సహాయం చేస్తున్న ఘటనలు వైరల్ అవుతున్నాయి. 

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!