స్వస్తిక్ న్యూస్, స్పోర్ట్స్:-
చెన్నై:- ఐపీఎల్-2026 సీజన్‌లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు సీనియర్ ప్లేయర్, మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ మరికొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది.
ముఖ్య అంశాలు:- ప్రస్తుతం ధోనీ గాయం నుండి కోలుకోవడానికి రిహాబిలిటేషన్‌లో ఉన్నారు. పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి ఆయనకు కనీసం మరో వారం రోజుల సమయం పట్టవచ్చని 'క్రిక్ బజ్' వెల్లడించగా.. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క విజయం కూడా నమోదు చేయని చెన్నైకి, ధోనీ అందుబాటులో లేకపోవడం పెద్ద లోటుగా మారింది.
తిరిగి వచ్చేది ఎప్పుడంటే?:- ధోనీ కోలుకున్న తర్వాత ఏప్రిల్ 18న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో జరగబోయే మ్యాచ్ నాటికి ఆయన జట్టులోకి అందుబాటులోకి వస్తారని CSK యాజమాన్యం ఆశిస్తోంది.
వరుస ఓటములతో డీలా పడ్డ చెన్నై జట్టును, 'థాలా' ధోనీ తన రాకతో మళ్లీ విజయపథంలోకి నడిపిస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.