Wednesday, 03 June 2026
SWASTHIK NEWS
Home / జాతీయ వార్తలు

హైదరాబాద్‌లో భారీగా పతనమైన వెండి ధరలు: ఒక్క రోజే రూ.10 వేలు క్రాష్

15 May 2026
12:01 PM
1,553

స్వస్తిక్ న్యూస్, తెలంగాణ :- బులియన్ మార్కెట్‌లో వెండి కొనుగోలుదారులకు ఇది ఒక ఆసక్తికరమైన పరిణామం. గత కొంత కాలంగా పెరుగుతూ వచ్చిన వెండి ధరలు హైదరాబాద్ మార్కెట్‌లో ఒక్కసారిగా భారీగా దిగివచ్చాయి. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే కిలో వెండి రేటు ఏకంగా రూ. 10 వేలు పతనమైంది. తాజా తగ్గుదలతో మార్కెట్‌లో కిలో సిల్వర్ ధర రూ. 3,05,000 వద్దకు చేరింది.ముఖ్యంగా గడిచిన రెండు రోజుల్లోనే కిలో వెండిపై ఏకంగా రూ. 15,000 మేర తగ్గడం మార్కెట్ వర్గాల్లో విశేషంగా మారింది.

బంగారం ధరల వివరాలు :-

మరోవైపు పసిడి ధరలు ఈ విధంగా నమోదు అయ్యాయి.

»24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (10 గ్రాములకు): రూ. 1,60,090

»22 క్యారెట్ల ఆభరణాల బంగారం (10 గ్రాములకు): రూ. 1,46,750 గా కొనసాగుతోంది.

ముఖ్య గమనిక:- తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలను బట్టి, అలాగే స్థానిక పన్నులు మరియు తయారీ ఛార్జీలను బట్టి మార్కెట్ ధరల్లో కొంత తేడాలు ఉండే అవకాశం ఉందని వినియోగదారులు గమనించగలరు.

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates