స్వస్తిక్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి నుంచి రాజకీయ నాయకులకు క్రీడా పోటీలు జరుగనున్నాయి. వివిధ క్రీడా పోటీలలో భాగంగా ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో రేపటి నుంచి ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలకు క్రీడ పోటీలు జరగనున్నాయి అని తాజాగా అధికారులు తెలిపారు. ఈ క్రికెట్ మ్యాచ్లలో పాల్గొనే జట్లలో ఒక జట్టుకు లోకేష్ మరో జుట్టుకు మనోహర్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.

మరోవైపు ఈ క్రీడా పోటీలలో పాల్గొనే రాజకీయ నాయకుల సంఖ్య పెరిగినట్లయితే వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరుతో మరో జట్టును ఏర్పాటు చేస్తారు అని కూడా సోషల్ మీడియాలో సమాచారం. సాధారణంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు ప్రతిరోజు ఏదో ఒక సమస్య ద్వారా ఒత్తిడి అనేది ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రజాప్రతినిధులకు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు రాజకీయ నాయకులకు పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.