HBD LOKESH :- యువ నాయకుడు, భవిష్యత్ తరాల ఆదర్శవంతుడు, మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ ప్రముఖ వ్యక్తులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం లోకేష్ కు అద్భుతంగా కొనసాగాలి అని జూనియర్ ఎన్టీఆర్ ట్విట్ చేయగా... మరోవైపు లోకేష్ కు మరింత శక్తితో పాటు సుఖ సంతోషాలు కలగాలని అని రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ట్వీట్ చేశారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలు మరియు సినిమా ప్రముఖులు సైతం లోకేష్ కు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి నారా లోకేష్ తండ్రికి తగ్గ తనయుడిగా అనిపించుకుంటూ రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకువస్తూ... రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పయనించేలా సర్వశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు పప్పు అని పిలిచిన వ్యక్తులే ఇప్పుడు శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు.
మా ఈ స్వస్తిక్ న్యూస్ తరపున.. "జన్మదిన శుభాకాంక్షలు లోకేష్ గారు"
https://www.swasthiknews.com/news/is-there-political-malice-behind-not-listening-to-bangladesh-