స్వస్తిక్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం వాతావరణం భిన్నంగా కనిపిస్తోంది. ఒక పక్క ఎండలు మండిపోతుంటే, మరో పక్క వర్షాలు కురుస్తూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్న తరుణంలోనే పలు జిల్లాల్లో అకాల వర్షాలు పలకరిస్తున్నాయి.
నిన్నటి ఉష్ణోగ్రతల వివరాలు :- గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత గరిష్ట స్థాయికి చేరింది.
•మన్యం జిల్లా వీరఘట్టంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.
•నెల్లూరు జిల్లా నెల్లూరుపాళెంలో కూడా ఎండలు దంచికొట్టాయి.
ఈ ప్రాంతాల్లో గరిష్టంగా 42.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
వర్ష సూచన : ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరిక :- ఎండలతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని, ఈరోజు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది.
ప్రభావితమయ్యే జిల్లాలు :- శ్రీకాకుళం (SKL), విజయనగరం (VZM) మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా,పోలవరం, అనకాపల్లి,కాకినాడ, కోనసీమ,ఉమ్మడి గోదావరి జిల్లాలు
పైన పేర్కొన్న ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉన్న సమయంలో చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని హెచ్చరించారు.