ప్రకాశం జిల్లా :- త్రిపురాంతకం మండల తహసిల్దార్ ఆర్దిక బకాయిలపై STU AP దశల వారి పోరాట కార్యక్రమంలో భాగంగా 12వ వేతన సవరణ సంఘమును ఏర్పాటు చేసి 30% మధ్యంతర భృతి మంజూరు చేయాలి మరియు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలు పే స్లిప్పులో చూపించి వెంటనే చెల్లించాలి.సిబిఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ విధానమును అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వ మెమో నెంబర్ 57 మేరకు 2004 సెప్టెంబర్1 కు ముందు నోటిఫికేషన్ ద్వారా నియమితులైన 2003 డిఎస్సీ ఉపాధ్యాయులు, పోలీసులు మరియు ఇతర శాఖల ఉద్యోగులకు ఓపిఎస్ ను తక్షణమే అమలు చేయాలి అని అన్నారు.పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఉద్యోగ విరమణ చేసిన మరుసటి రోజునే పెన్షన్ సౌకర్యాలు చెల్లించాలి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన డి.ఎ. లను వెంటనే మంజూరు చేయాలి అని అన్నారు.
వీటిపై ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాము. ఈ వినతిని సంబంధిత ఉన్నత అధికారులు మరియు ప్రభుత్వానికి పంపించి మా సమస్యల పరిష్కారానికి సహకరించగలరని ఆశిస్తూ మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమం లో STU AP త్రిపురాంతకం మండల అధ్యక్షులు M. జాన్ సామ్యూల్, ప్రధాన కార్యదర్శి CH. ఏడుకొండలు, RUPP అధ్యక్షులు B. శామ్యూల్, ప్రధాన కార్యదర్శి A.V వరప్రసాద్, APTF మండల ఉపాధ్యక్షులు G. నాగేశ్వరావు మరియు మిగతా మండల ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.