Monday, 16 March 2026
Swasthik News
Home / ఆంధ్రప్రదేశ్

ఒకవైపు ఎండలు,మరోవైపు వానలు.. తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం?

26 Feb 2026
03:46 PM
3,065

స్వస్తిక్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ :-  ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో వాతావరణంలో విచిత్రమైన మార్పులు కొనసాగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో పలుచోట్ల విపరీతమైన ఎండలతో ప్రజలందరూ సతమతమవుతుండగా మరోవైపు భారీ వర్షాలతో ప్రయాణికులు నానా తిప్పలు పడుతున్నారు. ఏది ఏమైనా కూడా ఈసారి వేసవిలో రావాల్సినటువంటి రుతుపవన  వర్షాలు ఈసారి మాత్రం చాలా ముందుగానే వచ్చాయి అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

Article Image

బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పలుచోట్ల దంచికొడుతున్నాయి. ద్రోణి ప్రభావం కారణంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచునున్నాయి. 

Article Image

 ఏపీలో వర్షాలు పడే జిల్లాలు :- 

1. శ్రీకాకుళం

2. ఉదయ గోదావరి

3. కృష్ణ 

4. గుంటూరు

5. బాపట్ల 

 తెలంగాణలో వర్షాలు కురిసే జిల్లాలు :- 

1. రంగారెడ్డి

2. వికారాబాద్

3. మెదక్

4. కామారెడ్డి 

 పైన పేర్కొన్న ఈ రెండు తెలుగు రాష్ట్రాల జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయి అని తాజాగా IMD వెల్లడించింది.

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!