Monday, 16 March 2026
Swasthik News
Home / మార్కాపురం

త్రిపురాంతకంలో "స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంధ్ర" కార్యక్రమం

21 Feb 2026
01:29 PM
65

స్వస్తిక్ న్యూస్, త్రిపురాంతకం :-  త్రిపురాంతకం  NSJC ఓ అండ్ ఎం సబ్ డివిజన్ కార్యాలయం వద్ద ఇవాళ శనివారం ఉదయం "స్వచ్ఛ ఆంధ్ర ∼ స్వర్ణ ఆంధ్ర" కార్యక్రమం నిర్వహించారు. NSP సబ్ డివిజన్ కార్యాలయం వద్ద పిచ్చి చెట్లను కొట్టివేసి , ఎండు పిచ్చి చెట్లను కాల్చి పరిశుభ్రం చేశారు. ఈ కార్యక్రమానికి ముందు NSP AEE G. భరత్ కుమార్, పుల్లలచెరువు మరియు త్రిపురాంతకం మండలాల సాగు నీటి వినియోగదారుల సంఘం D.C ప్రెసిడెంట్ శ్రీ దేవినేని చలమయ్య, ఆఫీస్ ఉద్యోగులు మరియు ఫీల్డ్ ఉద్యోగులు "స్వచ్ఛ ఆంధ్ర,-- స్వర్ణ ఆంధ్ర" ప్రతిజ్ఞ చేశారు.

Article Image

ఈ కార్యక్రమంలో NSP అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్  G. భరత్ కుమార్, త్రిపురాంతకం మరియు పుల్లల చెరువు సాగు నీటి వినియోగదారుల సంఘం D.C ప్రెసిడెంట్ శ్రీ దేవినేని చలమయ్య, LDC శ్రీ సుధాకర్, LDC శ్రీమతి D. భాగ్యం, వర్క్ ఇన్స్పెక్టర్లు, ఆఫీస్ అటెండర్లు, లస్కర్లు, ఉమెన్ మజ్దూర్లు మరియు వాచ్ మెన్ తదితరులు పాల్గొన్నారు.

Article Image

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!