స్వస్తిక్ న్యూస్, సినిమా న్యూస్ :- ప్రతిరోజు సినిమా షూటింగ్లలో బిజీబిజీగా గడుపుతున్నటువంటి తమన్నా తాజాగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఈ సినిమా జీవితంలో పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదిస్తూ ఉంటాం. కానీ సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల త్వరగా ఆ సంపాదించిన డబ్బులను కోల్పోతాము అని తమన్నా చెప్పుకొచ్చారు. నా సినిమా కెరీర్ ప్రారంభంలో నాకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా మా నాన్నగారే చూసుకునేవారు అని హీరోయిన్ తమన్నా అన్నారు.

అతను ఆర్థికంగా తీసుకునేటువంటి ప్లానింగ్ మొత్తం కూడా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఇవాళ నేను సంపాదించేటువంటి డబ్బులు మొత్తాన్ని కూడా మా నాన్నగారు నేర్పించినటువంటి ఆర్థిక ప్రణాళికల ప్లానింగ్ ద్వారానే ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నాను అని తెలిపారు. ఈరోజు రియల్ ఎస్టేట్, ఆభరణాలు లేదా ఇతర మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయగలుగుతున్నాను అంటే దానికి కారణం మా నాన్న అని అన్నారు. ఈ ఇండస్ట్రీలో ఆదాయం అనేది ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు అంటూ.. ఎంత పెద్ద యాక్టర్లు అయినప్పటికీ వాళ్ళు ఎంతో డబ్బులు సంపాదిస్తున్నప్పటికీ కూడా సరిగ్గా ప్లాన్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేయడం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని ఆమె ఇంటర్వ్యూలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుల్లో ఎంతోమంది స్టార్ నటులు కొన్ని కోట్లలో డబ్బులు సంపాదించినా కొద్దిరోజులు వ్యవధిలోనే అవన్నీ పోగొట్టుకొని చివరికి మీడియా ముందుకు వచ్చి వాటన్నిటి గురించి వివరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.