స్వస్తిక్ న్యూస్,హైదరాబాద్:- తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగులకు ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా లక్ష మంది దివ్యాంగులకు పెన్షన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య వెల్లడించారు. ఈ మేరకు అర్హులను గుర్తించి, త్వరలోనే లబ్ధిదారులకు పెన్షన్ అందజేస్తామని ఆయన తెలిపారు.
ముఖ్యమైన విశేషాల:- 40 శాతం వైకల్యం ఉన్న ప్రతి ఒక్కరికీ అవసరమైన అడ్వాన్స్‌డ్ పరికరాలను (Advanced Equipment) ప్రభుత్వం తరపున ఉచితంగా అందిస్తామని చైర్మన్ ప్రకటించా తొలి విడతలో భాగంగా దివ్యాంగుల కోసం 4,500 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించినట్లు పేర్కొన్నారు. దివ్యాంగుల రవాణా సౌకర్యం కోసం ఇప్పటివరకు 2 వేల స్కూటీలను ఉచితంగా పంపిణీ చేసినట్లు ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.రాష్ట్రంలోని దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి అవసరమైన అన్ని సౌకర్యాలను ప్రాధాన్యత క్రమంలో కల్పిస్తామని వీరయ్య ధీమా వ్యక్తం చేశారు.