Monday, 16 March 2026
Swasthik News
Home / క్రీడలు

IPL 2026 : సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు హై టెన్షన్

04 Feb 2026
12:36 PM
69

SPORTS NEWS :- ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కొత్త టెన్షన్ వచ్చి పడింది. తాజాగా జరిగిన మినీ వేలంలో కొంతమంది కీలక ప్లేయర్లను తీసుకొని ఈసారి కచ్చితంగా కప్ నెగ్గె విధంగా కసరత్తులు చేస్తుంది జట్టు యాజమాన్యం. కావ్య మారన్ సైతం ఈ ఏడాది ఇదే బలమైన జట్టు అని వివిధ సందర్భాల్లో కూడా తెలిపారు. కానీ ఇప్పుడు ఆ జట్టులోని ఓ స్టార్ ప్లేయర్ దూరమవుతారో ఏమో అని టెన్షన్ నెలకొంది.

Article Image

 సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కొంతకాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్నారట. ఐపీఎల్ 2026 ప్రారంభానికి మరో నెల రోజులు సమయం మాత్రమే ఉంది. త్వరలో జరగబోయే ప్రాక్టీస్ లో భాగంగా జట్టులో చేరేది లేదా చేరకపోయేది తన వెన్ను నొప్పిపై ఆధారపడి ఉంటుంది అని తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో భాగంగా కెప్టెన్ కమ్మిన్స్ వెల్లడించారు.

Article Image

 మరో రెండు మూడు వారాల్లో జరిగేటువంటి స్కాన్ ఫలితాలు సక్రమంగా ఉంటే ట్రైనింగ్ లో పాల్గొంటాను అని ఆయన యాజమాన్యానికి చెప్పినట్లుగా సమాచారం. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులు అందరూ కూడా టెన్షన్ లో పడిపోయారు. ఒకవేళ కచ్చితంగా ప్యాట్ కమ్మిన్స్ జట్టులో చేరకపోతే తర్వాత కెప్టెన్సీ ఎవరికి ఇస్తారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి జట్టులో క్లాసన్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి వంటి స్టార్ ఆటగాళ్లు  ఉన్నారు. కొన్ని మ్యాచ్లకు కమింగ్ దూరమవుతే వీళ్ళ ముగ్గురిలోనే ఎవరో ఒకరు కెప్టెన్సీ వ్యవహరిస్తారు అని కూడా ఇప్పటికే చాలామంది కామెంట్లు చేస్తున్నారు.  ఒకవేళ జట్టుకు కెప్టెన్ కమిన్స్ దూరమవుతాయి తర్వాత కెప్టెన్ ఎవరిని నియమిస్తారు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 

Article Image

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!