AP POLITICS:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ నాయకుల ఇళ్లపై దాడులు జరిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. సీఎం చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతోనే ఆగ్రహంతో రగిలిపోయిన కూటమి నాయకులు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వారి ఇంటిపై దాడులు చేయడం జరిగింది. అయితే ఈ దాడులలో వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు అలాగే జోగి రమేష్ ఇల్లు పూర్తిగా ధ్వంసం కావడం జరిగింది.


ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు భార్య హైకోర్టులో పిటిషన్ వేయగా.. హైకోర్టు విచారణ చేసిన అనంతరం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అంబటి రాంబాబు కుటుంబానికి 24 గంటల పాటు పూర్తి భద్రత కల్పించాలి అని ఆదేశించింది. అంతేకాకుండా రాష్ట్ర రాజకీయాల్లో దూషణలు మరియు వ్యక్తిగత దాడులు ఎక్కువవుతున్నాయి అని.. ప్రజా జీవితంలో రాజకీయ నాయకులు ఎంతో హుందాగా వ్యవహరించాలి అని పేర్కొంది. రాజకీయ నేతలు అసభ్యకర భాష మాట్లాడకూడదు అని.. వివాదాలకు తావు లేకుండా బాధ్యతగా నడుచుకోవాలి అని హైకోర్టు తెలిపింది.

కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా నడుచుకునే విధంగానే కనిపిస్తున్నాయి. ఈ దాడులు జరిగిన తర్వాత వైసిపి కీలక నేతలు అందరూ కూడా స్పందిస్తూ చర్యకు ప్రతి చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. మరి ఈ వివాదాలు ఎప్పటికీ శాంతించిన అర్థం కావడం లేదు. భవిష్యత్తులో ఒకవేళ పార్టీ మారిన ఈ దాడులు మాత్రం ఖచ్చితంగా ఉంటాయని ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా ఈ విషయంపైనే చర్చిస్తూ ఉన్నారు.