IND VS NZ :- భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐదవ టి20 మ్యాచ్ లో భారత బ్యాట్స్మెన్లు విధ్వంసకరమైన రీతిలో బ్యాటింగ్ చేస్తున్నారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకున్న టీమిండియా ప్రస్తుతం భారీ స్కోర్ చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఓపెనింగ్ చేసినటువంటి అభిషేక్ శర్మ మరియు సంజు సాంసంగ్ తక్కువ పరుగులకే అవుటయినా ఆ తరువాత ఇషాన్ కిషన్ మరియు సూర్య కుమార్ యాదవ్ చెలరేగి ఆడుతున్నారు.

అభిషేక్ శర్మ 30, సంజు శాంసన్ 6, ఇషాన్ కిషన్ ప్రస్తుతం 84*(37), సూర్య కుమార్ యాదవ్ 63, హార్థిక్ పాండ్యా 4* పరుగుల మీద ఆడుతూ రాణిస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 15 ఓవర్లకు 188 పరుగులు చేసింది. ఒకే ఓవర్ లో విషయాన్ని కిషన్ 29 పరుగులు కొట్టడం ఇదే మొదటిసారి. ఈ ఐదవ టి20 మ్యాచ్ లో భారత్ కచ్చితంగా 250 పరుగులు పైగా చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
