స్వస్తిక్ న్యూస్,క్రీడలు :- T20 వరల్డ్ కప్ లో భాగంగా యువ ఓపెనర్, విధ్వంసకర బ్యాటర్ అని చెప్పుకుంటున్నటువంటి అభిషేక్ శర్మ వరుసగా అన్ని మ్యాచ్లలోనూ విఫలమవుతూ వస్తున్నారు. ముఖ్యంగా ఈ టి20 వరల్డ్ కప్ ముందు వరకు ఎంతో విధ్వంసం సృష్టించి.. తీరా వరల్డ్ కప్ లో ఇంతటి ఘోరంగా విఫలం అవ్వడం చూస్తుంటే అభిమానులు కూడా నిరాశ చెందుతున్నారు. అయితే ఈ టి20 వరల్డ్ కప్ లో భారత అభిమానులు అభిషేక్ శర్మ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ దానికి అనుగుణంగా మాత్రం అభిషేక్ శర్మ ఆడడం లేదు.

ప్రతిరోజు కూడా ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ ఆడుతారు అని అనుకోవడం తప్పించి అతని బ్యాట్ నుంచి మాత్రం ఎటువంటి పరుగుల ప్రవాహమైతే చూడలేకపోతున్నాము. ఈ టి20 ప్రపంచ కప్ లో భాగంగా ఇప్పటివరకు ఆరు మ్యాచులు జరగగా కేవలం 80 పరుగులు మాత్రమే చేశారు. ఇందులో ఏకంగా మూడుసార్లు డక్ అవుట్ అవ్వడం కూడా మనందరం చూసాం. సూపర్-8 లో భాగంగా జింబాబ్వే పై జరిగినటువంటి మ్యాచ్లో అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ చేసి మల్లి ఫామ్ లోకి వచ్చాడని అనుకునే లోపే నిన్న జరిగినటువంటి వెస్టిండీస్ పై కేవలం 10 పరుగులకు మాత్రమే వెనుతిరిగారు. ఈ సందర్భంలోనే చాలామంది కూడా చాలా రకాలుగా కామెంట్ రూపంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అభిషేక్ శర్మను పక్కన పెట్టాలి అని అంటుండగా మరికొందరు మాత్రం అతను కీలకమైన మ్యాచ్ లో పక్కా గెలిపిస్తారు అని.. దానికి ఉదాహరణగా సాంసన్అని కూడా అంటున్నారు. మరి అభిషేక్ శర్మ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.