Monday, 16 March 2026
Swasthik News
Home / మార్కాపురం

ప్రకాశం జిల్లాలో మరోసారి వేడెక్కిన రాజకీయ వాతావరణం

15 Mar 2026
01:26 PM
169

స్వస్తిక్ న్యూస్, ప్రకాశం :- ప్రకాశం జిల్లాలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. వైసీపీ ఎమ్మెల్యా తాటిపర్తి  పై జనసేన పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇటీవల ఎమ్మెల్యా తాటిపర్తి చంద్రశేఖర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్  గురించి చేసిన వ్యాఖ్యలు అనుచితమని జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్  మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం ఎమ్మెల్యాల ప్రధాన బాధ్యత అని, కానీ వాటిని పక్కనబెట్టి ఇతర పార్టీల నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరైన రాజకీయ పద్ధతి కాదని ఆయన అన్నారు. రాజకీయాల్లో పరస్పర గౌరవం అవసరమని, ప్రజల ముందున్న నాయకులు మాటల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

     అలాగే జిల్లాలో ఉన్న అభివృద్ధి సమస్యలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, యువతకు ఉపాధి అవకాశాలపై ఎమ్మెల్యా దృష్టి పెట్టాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యాఖ్యలపై జన సేన పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా, రాజకీయ వర్గాల్లో కూడా ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు కూడా త్వరలో స్పందించే అవకాశం ఉందని, రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

 

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!