స్వస్తిక్ న్యూస్,ఆంధ్ర ప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల ప్రస్తావనలో సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి పేరు రావడం అనేది నిజంగా తలదించాల్సిన విషయమే. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది మనోభావాలు ఈ ఘటన తో దెబ్బతిన్నాయి. రాజకీయాల లోకి దేవుడుని పదేపదే లాగడం వెనుక ప్రజలు సైతం తీవ్రంగా అసహ్యించుకుంటున్నారు. కాసేపు ఈ తిరుమల లడ్డు కల్తీ విషయంలో తప్పు ఎవరిది అనే విషయం పక్కన పెడితే ప్రతిరోజు అధికార మరియు ప్రతిపక్ష పార్టీలు ఈ విషయంపై ఏదో ఒక విధముగా చర్చలు చేస్తూ తెరపైకి తీసుకువస్తున్నారు.

ప్రస్తుతం ఏపీ రాజకీయాలన్నీ కూడా తిరుమల లడ్డు కల్తీ విషయం చుట్టూనే తిరుగుతున్నాయి. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో ఇరు పార్టీల తీరును ప్రజలు సైతం వీక్షిస్తూ అయోమయంలో పడ్డారు. ఒకవైపు అధికార పార్టీ ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగింది అంటూ ఆరోపిస్తుండగా.. ప్రతిపక్ష పార్టీ ఇది పూర్తిగా అబద్ధం అంటూ వారిస్తున్నారు. ఇలా కొన్ని నెలలుగా ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదం చుట్టూనే చర్చలు జరుగుతున్నాయి. కొవ్వు, జంతు కొవ్వు,జస్ట్ కెమికల్ కల్తీ అంటూ రకరకాల వర్షన్లు అలాగే రీ వెర్షన్లతో మరక పూసి ఏ పార్టీ లాభం పొందాలని అనుకుంటుందో మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. కానీ ఈ విషయం గమనిస్తున్న ప్రజలు మాత్రం ఇరు పార్టీల పై మండిపడుతున్నారు.

కేవలం రాజకీయ స్వార్థానికై ప్రసాదం విషయం ను పదేపదే లేవనెత్తి ఆ స్వామివారి ప్రసాద పవిత్రతను తగ్గిస్తున్నారు అని జనాలు సైతం ఛీదరించుకుంటున్నారు. ఆ స్వామి వారి లడ్డును చూస్తే ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఆధ్యాత్మిక భావన అలాగే మదిలో ఆ దేవుడి రూపం కనిపించాలి కానీ ఇలా రాజకీయ ఆందోళనలు కలగకూడదు అని ప్రజలు అన్నీ పార్టీల నేతలకు సూచిస్తున్నారు. ఏమి జరిగినా అంతా ఆ స్వామివారే చూసుకుంటారు అని.. ఈ విషయాన్ని ఇంతటితో ఆపివేయండి అంటూ జనాలు రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒక విషయాన్ని గమనించాలి. ఆ దేవుడితోనే ఆటలాడితే ఆ దేవుడు మాత్రం చూస్తూ ఊరుకోరు. కాబట్టి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఈ విషయంపై ఆచితూచి అడుగు వేయాలి అని.. ఈ విషయానికి ఇంతటితో ముగింపు పలకాలి అని జనాలు కోరుకుంటున్నారు. మరి ఈ తిరుమల విషయాన్ని ఇంతటితో ముగించాలా?.. లేదా?.. ఒకవేళ మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే ఆ విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
