ANDRAPRADESH:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టమాట ధరలు క్షీణించి పోయాయి. గత మూడు నెలల క్రితం అనగా దసరా పండుగ సమయంలో కిలో టమోటా ధర 60 రూపాయలు పలకగా నేడు రూపాయి కూడా పలకడం లేదు అని టమాటా పండించిన రైతన్నలు కన్నీరు పెడుతున్నారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టమోటా ధరలు రైతులకు కన్నీళ్లే మిగులుస్తున్నాయి. ప్రతిరోజు కూడా ధరలలో మార్పులు రావడం వల్ల టమాటా పండించడానికి రైతులు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పెరిగితే ఆకాశమే హద్దుగా ధరలు పెరుగుతాయి అదే తగ్గితే ఏకంగా రూపాయి ధర కూడా పలకడం లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా రెండు వారాల క్రితం మదనపల్లి మార్కెట్లో కిలో పదిహేను రూపాయలు పలికిన నాణ్యమైన టమాటా రకం ఇప్పుడు ఏడు రూపాయలు కూడా పగడం లేదు అని రైతులు వాపోతున్నారు. ఇక నాణ్యం కానటువంటి టమాటా రకాల కైతే రెండు రూపాయలు కూడా రావడం లేదు అని రైతులు చెబుతున్నారు. టమాటా కు పెట్టుబడి పెట్టిన డబ్బులు కూడా తిరిగి వెనక్కి రావడం లేదు అని.. కూలి, ప్రయాణ ఖర్చులు కూడా భారం అవుతున్నాయి అని చాలామంది రైతులు టమాట పంటను వదిలేస్తున్నారు. మరోవైపు ధరలు సరిగా లేక మార్కెట్లలో కూడా టమాటా స్టాక్ అంతే ఉండిపోవడంతో కుళ్ళిపోతున్నాయి.
