స్వస్తిక్ న్యూస్, మార్కాపురం :- ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న పెద్దారవీడు మండల సోషల్ మీడియా సభ్యుడు జగన్మోహన్ రెడ్డి ని యర్రగొండపాలెం నియోజకవర్గ సోషల్ మీడియా టీం సభ్యులు మర్యాదపూర్వకంగా పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని, ధైర్యం చెబుతూ త్వరితగతిన పూర్తిస్థాయిలో కోలుకుని మళ్లీ పార్టీ కార్యక్రమాలు మరియు ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు.సేవా భావంతో పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందనే సందేశాన్ని సోషల్ మీడియా టీం సభ్యులు తెలియజేశారు.