Wednesday, 22 July 2026
SWASTHIK NEWS
Home / రాజకీయం

రాచకొండలో వైభవంగా శ్రీ రాముల వారి విగ్రహ ప్రతిష్ట.. పాల్గొన్న గూడూరి ఎరిక్షన్ బాబు

08 Apr 2026
02:22 PM
252

స్వస్తిక్ న్యూస్, పుల్లలచెరువు :- మండల పరిధిలోని రాచకొండ గ్రామంలో వెలసిన శ్రీ సీతారామ లక్ష్మణ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మరియు ధ్వజస్తంభ మహోత్సవం బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Article Image

కార్యక్రమ ముఖ్యాంశాలు:-

ప్రత్యేక పూజలు:- శాస్త్రోక్తంగా జరిగిన ధ్వజస్తంభ ప్రతిష్టాపనలో ఎరిక్షన్ బాబు పాల్గొని, స్వామి వారికి కొబ్బరికాయ కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎరిక్షన్ బాబుతో పాటు టీడీపీ, జనసేన మరియు బీజేపీ కూటమి నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Article Image

భక్తి పారవశ్యం:- రాముల వారి ప్రతిష్టను పురస్కరించుకుని గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు గారు మాట్లాడుతూ.. భక్తి మార్గం ద్వారానే మానసిక ప్రశాంతత లభిస్తుందని, రాముని ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates