స్వస్తిక్ న్యూస్, స్పోర్ట్స్ :- ప్రస్తుతం టీమిండియాలో ఎంతోమంది స్పిన్ బౌలర్స్ ఉన్నారు. ఒకప్పుడు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అక్షర పటేల్ లాంటి వారు టీమిండియా జట్టు స్పిన్ విభాగంలో కీలక పాత్ర పోషించారు. కానీ నేడు టీమిండియా జట్టులో ఈ స్పిన్నర్ లేకపోతే మ్యాచ్ ఓడిపోతామేమో అన్న భావన కలుగుతుంది. ఆ స్టార్ స్పిన్నరే వరుణ్ చక్రవర్తి.

ప్రస్తుతం టీమిండియాలో స్పిన్ విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్న స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సక్సెస్ వెనుక త్యాగం, కన్నీటి గాధ ఉంది అంటూ తాజాగా వరుణ్ చక్రవర్తి సతీమణి నేహా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరుణ్ చక్రవర్తి అలాగే నేహా వీరిద్దరూ కూడా ఎస్ఆర్ఎం వర్సిటీలో ప్రేమలో పడ్డారు. ఒక ఆర్కిటెక్ట్ జాబు వదిలేసుకుని క్రికెట్ వైపు వెళ్ళాలి అనుకున్న వరుణ్ చక్రవర్తికి నేహా కొండంత బలంగా నిలిచారు. నేను ఎలాగోలా సంపాదిస్తాను నువ్వు వెళ్లి క్రికెట్ ఆడు అని వరుణ్ చక్రవర్తికి తన భార్య ధైర్యం ఇచ్చారట.

అయితే పెళ్లి సమయంలో భవిష్యత్తుపై ఎలాంటి భరోసా లేనప్పుడు తనను వివాహం చేసుకోవద్దు అని వరుణ్ చక్రవర్తి చెప్పిన కూడా ఆమె వినకుండా నచ్చే పెళ్లి చేసుకున్నారు. లైఫ్ పార్ట్నర్ విషయంలో నేహా ఎటువంటి తప్పు చేయలేదు అని.. మనసుకు నచ్చాడు కాబట్టే వరుణ్ చక్రవర్తిని ఎన్ని కష్టాలు వచ్చినా వదులుకోలేదు అని తెలిపారు. కష్ట సమయాలలో భర్తకు అండగా నిలిచినటువంటి స్నేహకు సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.