స్వస్తిక్ న్యూస్,మార్కాపురం :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు మార్కాపురం జిల్లా వెలుగొండ పర్యటనకు రానున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలను తాజాగా మార్కాపురం ఇన్చార్జి కలెక్టర్ రాజాబాబు తెలియజేశారు. రేపు ఉదయం 11 గంటలకు హెలిప్యాడ్ వద్దకు చేరుకొని వెలుగొండ ప్రాజెక్ట్ కెనాల్ పనులను పరిశీలిస్తారు. 11:30 గంటలకు ఫీడర్ కెనాల్ శంకుస్థాపన, ప్రాజెక్ట్ పనుల పరిశీలన కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ఆ తరువాత వెంటనే మార్కాపురం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం రోడ్డు సమీపంలో ఉన్నటువంటి సాయి బాలాజీ మోడల్ స్కూల్ ఎదురు భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు విషయాలను ప్రజలతో పంచుకొనున్నారు. ఇక అనంతరం క్యాడర్ మీటింగ్ పనులను చూసుకొని తిరిగి పైనమవుతారు అని మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్న వేళ ప్రజలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వెలిగొండ ప్రాజెక్టు గురించి కూడా ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారో.. అని జిల్లావ్యాప్తంగా ప్రజలందరిలో కూడా ఒక ఉత్కంఠత నెలకొంది. కాగా మరోవైపు సీఎం పర్యటన సందర్భంగా ఇప్పటికే వెలుగొండ ప్రాజెక్ట్ పనులను, బహిరంగ సభ ఏర్పాట్లపై ఎటువంటి ఆటంకాలు కలుగకుండా అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లను త్వరత్వరగా పూర్తి చేస్తున్నారు. నాలుగు నియోజకవర్గాల ప్రజల ఆకాంక్షతో మార్కాపురం నూతన జిల్లా ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు రాకతో ఎమ్మెల్యేలు అలాగే ఇన్చార్జులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అని జిల్లా ప్రజలను కోరారు.

సీఎం రాకతో అన్నిచోట్ల కూడా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. సీఎం పర్యటన విజయవంతంగా పూర్తి అవ్వాలని అధికార యంత్రాంగం, కూటమి నాయకులు సర్వశక్తుల అన్ని పనులను స్వయంగా సమీక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వెలుగొండ ప్రాజెక్టు విషయంపై ఏమైనా సందేహాలు అడగదలుచుకుంటే కామెంట్ ద్వారా తెలియజేయండి.