స్వస్తిక్ న్యూస్, అంతర్జాతీయం :- ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య బీకరమైన యుద్ధం జరుగుతున్న వేళ చాలా మంది సెలబ్రిటీలు యుద్ధం జరిగేటటువంటి దేశాల్లో చిక్కుకుపోయినట్లుగా సోషల్ మీడియా వేదికగా చాలానే వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నిజమని కొన్ని స్పష్టంగా అర్థం అవుతుంటే మరికొన్ని మాత్రం గందరగోళం సృష్టిస్తున్నాయి. ఇక తాజాగా ఇరాన్- ఇజ్రాయిల్ యుద్ధం వేల తమిళ స్టార్ హీరోలు అజిత్ మరియు మాధవన్ దుబాయ్ లో చిక్కుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.

ఈ వార్తలు రాగానే ఎంతోమంది వారి అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే వెంటనే అజిత్ టీమ్ స్పందిస్తూ అజిత్ క్షేమంగా ఉన్నారు అని.. మోటార్ స్పోర్ట్స్ ఈవెంట్ కు దుబాయ్ కి వెళ్లినటువంటి అజిత్ నిన్న తిరిగి రావాల్సి ఉండగా ఈ యుద్ధ వాతావరణం లో చిక్కుకుపోయారు. మరోవైపు మాధవన్ స్పందిస్తూ నేను ఫ్యామిలీతో యూఎస్ లో క్షేమంగానే ఉన్నట్లు ప్రకటించారు. అయితే మన టాలీవుడ్ హీరో మంచు విష్ణు, సునాల్ చౌహాన్, పీవీ సింధు వంటి తదితరులు దుబాయిలో చిక్కుకుపోయారు. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యుద్ధ వాతావరణం ముగిస్తే కానీ వీరు తిరిగి మన దేశానికి వచ్చే పరిస్థితులు కూడా కనిపించడం లేదు.