Monday, 16 March 2026
Swasthik News
Home / జాతీయ వార్తలు

ఫ్లైట్ క్రాష్ లో ఇప్పటివరకు చనిపోయిన ప్రముఖ వ్యక్తులు వీరే..?

28 Jan 2026
01:22 PM
59

FLIGHT CRASH DEATHS :-మన భారతదేశంలోని వివిధ రంగాల ప్రముఖ వ్యక్తులు విమాన ప్రమాదాలలో మృతి చెందారు. అందులో రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, సినిమా నటులు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాల లోని ప్రముఖ వ్యక్తులు దురదృష్టవశాత్తు విమాన ప్రమాదంలో మృతి చెందారు. ఇక ఈరోజు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందగా.. సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరూ కూడా విమానా ప్రమాదాలలో మృతి చెందిన ప్రముఖ వ్యక్తులు ఎవరు..? అని తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ రోజు మన ఈ స్వస్తిక్ న్యూస్ ద్వారా ఇప్పటివరకు విమాన ప్రమాదాలలో మృతి చెందిన మన భారతదేశ ప్రముఖ వ్యక్తులు ఎవరో తెలుసుకుందాం. 

 విమాన ప్రయాణాలలో మృతి చెందిన ప్రముఖ వ్యక్తులు 

Article Image

  ఇప్పటివరకు మన భారతదేశంలో విమాన ప్రమాదాలు చోటుచేసుకుని కొంతమంది కీలక వ్యక్తులు మృతి చెందారు. అందులో నటి సౌందర్య ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటారు. 2004వ సంవత్సరంలో బీజేపీ ఎన్నికల ప్రచారానికి వెళుతూ బెంగళూరు  వద్ద హెలికాప్టర్ ప్రమాదంలో  హీరోయిన్ సౌందర్య మృతి చెందారు. ఈమె మృతి అప్పటిలో సంచలనం సృష్టించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక 2005లో హర్యానా మంత్రి, వ్యాపారవేత్త ఓం ప్రకాష్ జిందాల్ మృతి చెందారు.

Article Image

2009 సెప్టెంబర్ లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నల్లమల్ల అడవిలోని పావురాల గుట్టపై హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మృతితో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఎంతటి దుఃఖానికి గురి చెందారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక ఆ తర్వాత 2021లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ తమిళనాడులోని హెలికాప్టర్ క్రాష్ లో మృతిచెందారు. 2025లో ఎయిర్ ఇండియా ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి కూడా మృతి చెందారు. ఇక ఇవ్వాలా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఇటువంటి విమాన ప్రమాదంలోనే మృతి చెందారు.

Article Image

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!