స్వస్తిక్ న్యూస్, క్రీడలు :- ఐపీఎల్‌లో భాగంగా ఈరోజు మరో ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. Indian Premier League టోర్నీలో భాగంగా పంజాబ్ జట్టు, గుజరాత్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ న్యూ చండీగర్ (పంజాబ్) వేదికగా జరగనుంది.ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు రెండు జట్లు గట్టిగా సిద్ధమయ్యాయి. పంజాబ్ కింగ్స్ తమ బ్యాటింగ్, బౌలింగ్ బలంతో గెలవాలని చూస్తుండగా, గుజరాత్ టైటాన్స్ జట్టు కూడా సమతూకమైన ప్రదర్శనతో విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పంజాబ్ జట్టులో కీలక ఆటగాళ్లు ఫామ్‌లో ఉండగా, గుజరాత్ జట్టులో కూడా మ్యాచ్ విన్నర్ ప్లేయర్లు ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మ్యాచ్ ఈరోజు రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. Punjab Kings మరియు Gujarat Titans జట్ల మధ్య జరిగే ఈ పోరు అభిమానులకు మంచి వినోదాన్ని అందించనుంది. అయితే గత ఏడాది రన్నరప్ గా పంజాబ్ కింగ్స్ నిలవడంతో ఈ ఈరోజు జరిగే మ్యాచ్ లో ఎన్నో ములుపులు చూస్తాం. పంజాబ్ కింగ్స్ ఈరోజు జరిగే మ్యాచ్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ గుజరాత్ ఇప్పటికే ఒక ట్రోఫీ నెగ్గి ఏమాత్రం తక్కువ కాదని ఢీకొట్టబోతుంది. ఇప్పటికే ఐపీఎల్ స్టార్ట్ అయి మూడు రోజులు అయింది. ఈ ఏడాది వేసవికాలంలో క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ ద్వారా మరింత మజా రానుంది. మరి ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్లో ఏ టీం విజయం సాధిస్తుంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.