స్వస్తిక్ న్యూస్, పుల్లలచెరువు :- ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలో సోమవారం మధ్యాహ్నం సంభవించిన పిడుగుపాటు ఒకరి ప్రాణాలను బలి తీసుకోగా, మరో నలుగురిని ఆసుపత్రి పాలు చేసింది.
ఘటన వివరాలు:-మండల కేంద్రమైన పుల్లలచెరువులో సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారి భారీ వర్షం కురిసింది. వర్షం పడుతున్న సమయంలో ఒక్కసారిగా పిడుగు పడటంతో అక్కడ ఉన్న ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం యర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వారు తెలిపారు. ఈ విషాదంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.