స్వస్తిక్ న్యూస్,త్రిపురాంతకం:- త్రిపురాంతకం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు సముద్రాల ముని కుమారి మల్లికార్జున గారి ఆధ్వర్యంలో, ప్రకాశం జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసులు పుట్టినరోజు వేడుకలను పార్టీ కార్యకర్తలతో కలిసి ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ముందుగా కేక్ కట్ చేసి, చిన్నారులకు మిఠాయిలు పంచి ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం కార్యకర్తలు మాట్లాడుతూ.. సెగ్గం శ్రీనివాసులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రజాసేవలో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించి పార్టీకి, సమాజానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు కొండ్రు పిచ్చయ్య, మండల ప్రధాన కార్యదర్శి సముద్రాల మల్లికార్జున రావు, హరికృష్ణ, సోమశేఖర్, అన్నా గురునాథం, మాగులూరి వెంకటేశ్వర్లు, చిన్నారులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
