Wednesday, 03 June 2026
SWASTHIK NEWS
Home / క్రీడలు

సిక్సర్ల సునామీ: 21 సిక్సర్లతో విరుచుకుపడ్డ పంజాబ్ బ్యాటర్లు!

19 Apr 2026
09:26 PM
95

స్వస్తిక్ న్యూస్, స్పోర్ట్స్ :- IPL 2026: ఐపీఎల్‌లో భాగంగా లక్నోతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ జట్టు 7 వికెట్ల నష్టానికి ఏకంగా 254 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.

​బ్యాటర్ల వీరవిహారం:- పంజాబ్ బ్యాటర్లు ఆరంభం నుండే లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఇద్దరు బ్యాటర్లు మైదానంలో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు.ప్రియాంక్ష్ ఆర్య కేవలం 37 బంతుల్లోనే 93 పరుగులు చేసి సెంచరీకి చేరువయ్యారు. ఇందులో 9 భారీ సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి.కనోలి ఈయన కూడా తక్కువ తినలేదు. 46 బంతుల్లో 7 సిక్సర్లు, 8 ఫోర్లతో 87 పరుగులు చేసి జట్టు స్కోరును పరుగులు పెట్టించారు.

​రికార్డుల మోత :-ఈ మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్లందరూ కలిసి ఏకంగా 21 సిక్సర్లు బాదడం గమనార్హం. పవర్‌ప్లే నుండి చివరి ఓవర్ వరకు బౌండరీల మోత మోగడంతో స్టేడియం మార్మోగిపోయింది. ఈ భారీ స్కోరుతో పంజాబ్ జట్టు ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

Swasthik News

Share this Article

Chenna

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates