Wednesday, 03 June 2026
SWASTHIK NEWS
Home / క్రీడలు

వైభవ్ ఊచకోత.. కోహ్లీ ఫిదా! చిన్నోడికి 'రన్ మెషిన్' స్పెషల్ ఆటోగ్రాఫ్

11 Apr 2026
10:16 AM
97

స్వస్తిక్ న్యూస్, స్పోర్ట్స్:- ఐపీఎల్ (IPL) వేదికగా మరో కొత్త నక్షత్రం ఉదయించింది. రాజస్థాన్ రాయల్స్ (RR) యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తన సంచలన బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్‌లో ఈ 15 ఏళ్ల కుర్రాడు ఆడిన ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోనుంది.

మ్యాచ్ హైలైట్స్:-

​మెరుపు ఇన్నింగ్స్: కేవలం 26 బంతుల్లోనే 78 పరుగులు సాధించి వైభవ్ విధ్వంసం సృష్టించారు. అంతర్జాతీయ స్థాయి బౌలర్లను సైతం లెక్కచేయకుండా మైదానం చుట్టూ బౌండరీల వర్షం కురిపించారు.

రికార్డు:- అతి పిన్న వయసులోనే ఐపీఎల్‌లో ఇంతటి భారీ ఇన్నింగ్స్ ఆడిన ఆటగాడిగా వైభవ్ గుర్తింపు పొందారు.

కోహ్లీ ప్రశంసల జల్లు:-మ్యాచ్ ముగిసిన తర్వాత టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ స్వయంగా వైభవ్‌ను కలిసి అభినందించారు. వైభవ్ బ్యాటింగ్ శైలికి ముగ్ధుడైన కోహ్లీ, అతనికి ఒక మధుర జ్ఞాపకాన్ని అందించారు.

​వైభవ్ క్యాప్‌పై ‘డియర్ వైభవ్.. వెల్ డన్’ అని రాసి తన ఆటోగ్రాఫ్‌ను ఇచ్చారు.

​మ్యాచ్ గెలిపించినందుకు లభించిన POTM (ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్) అవార్డు, లీగ్‌లో టాప్ స్కోరర్‌గా అందుకున్న ఆరెంజ్ క్యాప్, మరియు తన ఆరాధ్య దైవం కోహ్లీ ఇచ్చిన ఆటోగ్రాఫ్ క్యాప్‌ను టేబుల్‌పై ఉంచుకుని వైభవ్ సంతోషంలో మునిగిపోయారు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Swasthik News

Share this Article

Chenna

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates