స్వస్తిక్ న్యూస్:- ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో మరో కీలక అడుగు పడనుంది. విశాఖపట్నం నుంచి అంతర్జాతీయ స్థాయి క్రూయిజ్ సేవలు ప్రారంభించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. గతంలో విశాఖ - చెన్నై మధ్య విజయవంతంగా నడిచిన క్రూయిజ్ సేవలను ఇప్పుడు విదేశాలకు విస్తరిస్తున్నారు.
ప్రయాణ వివరాలు:-ప్రారంభ తేదీ జూలై 15 నుంచి సేవలు ప్రారంభం కానున్నాయి.నౌక పేరు 'కార్డిలియా' (Cordelia) క్రూయిజ్.రూట్ మ్యాప్వి శాఖపట్నం నుంచి బయలుదేరి చెన్నై మీదుగా.. థాయ్‌లాండ్‌లోని ఫుకెట్, మలేషియాలోని లంకావి, కౌలాలంపూర్ నగరాలను సందర్శిస్తుంది. చివరగా సింగపూర్ చేరుకుని తిరిగి రానుంది.
ప్రయాణ వ్యవధి మొత్తం 14 రోజుల పాటు ఈ విలాసవంతమైన నౌకా విహారం కొనసాగుతుంది.కీలక అంశాలు.ఈ క్రూయిజ్‌లో పర్యాటకులకు అత్యున్నత స్థాయి సదుపాయాలు, వినోదం మరియు విలాసవంతమైన వసతి కల్పించనున్నారు. తొలిసారిగా విశాఖ నుంచి నేరుగా అంతర్జాతీయ యాత్రకు రంగం సిద్ధమవడంతో పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు.టికెట్ ధరలకు సంబంధించి పూర్తి వివరాలు మరియు క్లారిటీ త్వరలోనే అధికారికంగా వెల్లడి కానుంది. సముద్ర ప్రయాణాన్ని ఇష్టపడే వారికి, విదేశీ పర్యటన చేయాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశంగా మారనుంది.