స్వస్తిక్ న్యూస్,ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. ప్రస్తుతం రిజర్వాయర్‌లో సుమారు 44 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నట్లు అధికారులు తెలిపారు. నీటి మట్టం తగ్గిపోవడంతో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.గత ఏడాదితో పోల్చితే ఈసారి నీటి నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. గత ఏడాది ఇదే సమయానికి ఎపీ గేట్లలో 2060 మిలియన్ యూనిట్లు, ఎడమ గేట్లలో 2,725 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం నీటి కొరత కారణంగా విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.

ఇక ఉమ్మడి ఏపీలో 2007-08 సంవత్సరంలో 2,544 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగినట్లు అధికారులు గుర్తుచేశారు. ప్రస్తుతం నీటి మట్టం పడిపోవడంతో భవిష్యత్తులో విద్యుత్ సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.