స్వస్తిక్ న్యూస్,పుల్లలచెరువు:- కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న దేశవ్యాప్తంగా చేపట్టనున్న సమ్మెలో పాల్గొంటున్నట్లు మండల సిఐటియు నాయకులు బొజ్జా వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు పుల్లలచెరువులో పంచాయతీ కార్మికులు సచివాలయం-1 లో సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాపాడుకునేందుకే ఈ సమ్మె చేస్తున్నట్లుగా తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు .