స్వస్తిక్ న్యూస్, హైదరాబాద్:- వైవాహిక బంధం అనేది ఇద్దరి వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు విభిన్న మనస్తత్వాలు ఒకటయ్యే పవిత్ర బంధం. అయితే పెళ్లి చేసుకునే సమయంలో భాగస్వాముల మధ్య వయసు తేడా (Age Gap) ఎంత ఉండాలనే విషయంపై సమాజంలో ఎప్పుడూ రకరకాల చర్చలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా ఈ అంశంపై ఒక ప్రముఖ వైద్య నిపుణులు వెల్లడించిన ఆసక్తికరమైన విషయాలు నెట్టింట వైరల్‌గా మారాయి.
వయసు తేడా ఎంత ఉంటే మంచిది?వైద్యుల విశ్లేషణ ప్రకారం.. భార్యాభర్తల మధ్య 3 నుండి 7 ఏళ్ల వయసు తేడా ఉండడం అత్యంత ఉత్తమమని వారు సూచిస్తున్నారు. ఈ విధమైన వయసు వ్యత్యాసం ఉండడం వల్ల దంపతుల మధ్య అనేక సానుకూల మార్పులు వస్తాయని పేర్కొన్నారు.
భాగస్వాముల మధ్య సరైన వయసు తేడా ఉన్నప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకునే తత్వం, పరస్పర నమ్మకం పెరుగుతాయి. జీవితంలో ఎదురయ్యే విభిన్న పరిస్థితులను ఇద్దరూ ఒకే విధమైన దృక్పథంతో, పరిణతితో ఆలోచించే అవకాశం ఉంటుంది. ఈ వయసు వ్యత్యాసం ఇద్దరి మధ్య బలమైన భావోద్వేగ అనుబంధాన్ని (Emotional Connection) ఏర్పరుస్తుంది. నిపుణులు కేవలం వయసు తేడా మాత్రమే కాకుండా సంసార జీవితంలో అంతకంటే ముఖ్యమైన విషయాల గురించి కూడా నొక్కి చెప్పారు. వారి ప్రకారం వయసు తేడా ఎంత ఉన్నప్పటికీ.. "ఒకరినొకరు గౌరవించుకోవడం, జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యనైనా ఇద్దరూ కలిసికట్టుగా చర్చించుకుని పరిష్కరించుకోవడమే" విజయవంతమైన వైవాహిక జీవితానికి అసలైన రహస్యమని స్పష్టం చేశారు. పరస్పర గౌరవం, సర్దుబాటు తత్వమే పెళ్లి బంధాన్ని నిలబెడతాయని నిపుణుల మాట.