Tuesday, 21 July 2026
SWASTHIK NEWS
Home / ఆసక్తికరమైన నిజాలు

ఏటీఎం పిన్‌లో 4 అంకెలే ఎందుకు? దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ!

12 Jul 2026
12:32 PM
1,596

స్వస్తిక్ న్యూస్, ఫాక్ట్స్ :- మనం ప్రతిరోజూ ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునేటప్పుడు 4 అంకెల పిన్‌ను ఉపయోగిస్తుంటాం. కానీ, ఎప్పుడైనా ఆలోచించారా? ఈ పిన్ 4 అంకెలు మాత్రమే ఎందుకు ఉంటుందని? దీని వెనుక ఒక ఆసక్తికరమైన సంఘటన ఉంది.

తొలి ఏటీఎం రూపకల్పన...  ప్రపంచంలోనే మొట్టమొదటి ఏటీఎంను 1967లో స్కాట్లాండ్‌కు చెందిన జాన్ షెపర్డ్ బారన్ అనే వ్యక్తి కనుగొన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా, ఆయన మొదట దీని కోసం 6 అంకెల పిన్ విధానాన్ని రూపొందించారు. జాన్ షెపర్డ్ బారన్ భార్య కరోలిన్, 6 అంకెల పిన్‌ను గుర్తుపెట్టుకోవడంలో ఇబ్బంది పడ్డారు. ఆమె కేవలం 4 అంకెలను మాత్రమే సులభంగా గుర్తుపెట్టుకోగలిగారు. తన భార్య ఎదుర్కొన్న ఈ ఇబ్బందిని గమనించిన జాన్, సామాన్య ప్రజలకు కూడా 6 అంకెల పిన్ గుర్తుంచుకోవడం కష్టంగా మారుతుందని భావించారు.అందరికీ సులువుగా గుర్తుండేలా ఉండాలనే ఉద్దేశ్యంతో, ఆయన ఏటీఎం పిన్‌ను 6 అంకెల నుంచి 4 అంకెలకు తగ్గించారు.

Article Image

ఈ 4 అంకెల పిన్ విధానం ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉండటంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాంకులన్నీ దీనిని స్వాగతించాయి. కాలక్రమంలో ఇదే విధానాన్ని ప్రామాణికంగా మార్చేశాయి. అందుకే నేటికీ మనం ఏటీఎంలలో 4 అంకెల పిన్‌ను ఉపయోగిస్తున్నాం.

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates