RENU DESAI :- సోషల్ మీడియాలో ప్రతిరోజు కూడా ఏదో ఒక విషయం సంచలనం సృష్టిస్తుంది. గత రెండు రోజులుగా సోషల్ మీడియా అంతటా కూడా మూగజీవాల వ్యవహారం పైనే చర్చ కొనసాగుతుంది. ముఖ్యంగా కొంతమంది సెలబ్రిటీలు మూగజీవాలపై చేసినటువంటి వ్యాఖ్యలపై విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇందులో భాగంగానే ముఖ్యంగా నటి రేణు దేశాయ్ కుక్కలపై కొన్ని వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలకు ఆమె నెటిజనుల నుంచి విమర్శలు పొందుతున్నారు. ఇదంతా ఇలా ఉండగా తాజాగా ఆమె మరోసారి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ప్రాణికి ఏదో ఒక రోజు మరణం సంభవిస్తుంది అని.. ఇందులో మనుషులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు మరణించాల్సిందే కాబట్టి.. దేని పైన కూడా ద్వేషం పెంచుకోవద్దు, ప్రశాంతంగా జీవించండి అంటూ పిలుపునిచ్చారు. ఇదంతా కూడా ఇన్స్టా గ్రామ్ వేదికగా లైవ్ లో ఆమె చెప్పుకొచ్చారు.