స్వస్తిక్ న్యూస్, పుల్లలచెరువు :- మార్కాపురం జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు గాను,జై భీమ్ రావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ కు పుల్లల చెరువుకు చెందిన దర్శి వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. మార్కాపురం జిల్లా జై భీమ్ రావ్ భారత్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ అందుబాటులో ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తానన్నారు. పార్టీ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తానని తెలిపారు.
