స్వస్తిక్ న్యూస్, పుల్లలచెరువు :-పుల్లలచెరువు మండలం క్లస్టర్-05 ముటుకుల గ్రామంలో ఘనంగా నిర్వహించిన మహానాడు కార్యక్రమానికి స్థానిక మహిళలు భారీ ఎత్తున తరలివచ్చారు. యర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జి గూడూరి ఎరిక్సన్ బాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, ఆంధ్రుల ఆరాధ్య దైవం, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహానేత స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ముటుకుల గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి ఆయన చిత్రపటానికి మహిళలు ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ, ఎన్టీఆర్ తెలుగు ప్రజల గర్వకారణమని, ఆయన ప్రజాసేవా దృక్పథం ఎప్పటికీ ఆదర్శమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు , మహిళా కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.