»హైదరాబాద్ లో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
»వైఎస్సార్ విగ్రహానికి వై. పాలెం ఎమ్మెల్యే నివాళి.
స్వస్తిక్ న్యూస్, మార్కాపురం :- హైదరాబాదు కూకట్ పల్లి లోని బాలాజీ నగర్ లో వైసీపీ ఆవిర్భవించి 16వ వసంతంలోకి అడుగు పెట్టిన సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎర్రగొండపాలెం శాసనసభ్యులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే చంద్రశేఖర్ తో పాటుగా ప్రకాశం జిల్లా ఐటీ వింగ్ అధ్యక్షులు దొండేటి నాగేశ్వర రెడ్డి, గంగవరం సర్పంచ్ జొన్నవరపు. వెంకట రెడ్డి, పలువురు రాష్ట్ర స్థాయి వైసిపి నాయకులు పాల్గొన్నారు.
