స్వస్తిక్ న్యూస్, పుల్లలచెరువు :- పుల్లలచెరువు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్‌గా సేవలందించి, బదిలీపై వెళ్తున్న ఎస్.ఐ సంపత్ కుమార్ కు కృతజ్ఞతలు తెలుపుతూ పుల్లల చెరువు మండల వైసీపీ నాయకులు సాంప్రదాయబద్ధంగా శాలువాలతో సత్కరించారు. ఆయన నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, తనదైన శైలిలో విధులు నిర్వహించి అందరి మెప్పు పొందినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పుల్లల చెరువు మండల YSRCP ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.