స్వస్తిక్ న్యూస్, యర్రగొండపాలెం :- వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మార్కాపురం జిల్లా, యర్రగొండపాలెంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో యర్రగొండపాలెం మండల కన్వీనర్ ఏకుల ముసలా రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు.అనంతరం వైసీపీ జెండా ఎగరవేసి కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, జిల్లా నాయకులు,గ్రామ కమిటీ అధ్యక్షులు,కార్యకర్తలు పాల్గొన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాలలో వైసిపి పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుపుతున్నారు.