Monday, 16 March 2026
Swasthik News
Home / ఆసక్తికరమైన నిజాలు

సూర్యోదయానికి ముందే కోళ్లు కొక్కొరకో అని మనల్ని ఎలా నిద్రలేపుతాయో మీకు తెలుసా?

28 Jan 2026
10:59 AM
48

TELUGU FACTS :- ప్రతిరోజు సూర్యోదయానికి ముందే కోళ్లు కొక్కొరకో అని మనల్ని నిద్ర లేచేలా  చేస్తూ ఉంటాయి. ఈ రోజుల్లో పట్టణాలలో కోళ్లు కనుమరుగు కావడంతో పట్టణాల్లో నివసించే వారికి ఈ విషయం పెద్దగా తెలియకపోవచ్చు. కానీ గ్రామాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సన్నివేశం తప్పకుండా ఎదురవుతుంది. మరికొద్ది సేపట్లో సూర్యోదయం కాబోతుందన్న సంకేతాన్ని ఇస్తూ కోళ్లు కూయడం మనం గ్రామాల్లో ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. అయితే దీనికి గల కారణం ఏంటో తాజాగా శాస్త్రవేత్తలు కనిపెట్టేశారు.

Article Image

 ప్రతి కోడిలోనూ ఒక జీవ గడియారం( బయోలాజికల్ క్లాక్) అనేది ఉంటుంది అట. దీని ద్వారానే మనిషి కన్న 45 నిమిషాల ముందే కోడి వెలుతురును చూడగలుగుతుంది అని శాస్త్రవేత్తలు తెలియజేశారు. అందుకే వెలుతురు వస్తుంది అని తెలియజేయడానికి కోడి మనిషి కన్నా ముందే కొక్కొరొకో అని కూస్తూనే మనుషులకు ఒక గడియారంలా పనిచేస్తుంది. దీని ద్వారానే మనుషులు కూడా ఈ కోళ్ల అరుపులకు నిద్రలేస్తారు. 

Article Image

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!